దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ నెం. 1 అని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ గంజి చిరంజీవి అన్నారు. మంగళగిరి నగరంలోని ఏడవ వార్డు ఏపీఎస్పీ క్యాంపు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్చి వద్ద గురువారం గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.