గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ... దేశసేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణమిదని, స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకోవాలని, ప్రధాని నరేంద్రమోదీ అంత్యోదయ స్ఫూర్తిగా అడుగులు వేస్తున్నారన్నారు.