రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలను పరిరక్షించడమే మన స్వాతంత్య్ర సమరయోధులకు అర్పించే నిజమైన నివాళి అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తోటి పౌరులకు శుభాకాంక్షలు తెలుపుతూ, స్వాతంత్ర్య సమరయోధుల కలలను ఏకం చేసిన రాజ్యాంగం భారత గణతంత్రానికి ఆత్మ అని అన్నారు. శుక్రవారం భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు.రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి భరోసా కల్పించిన ప్రాథమిక హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ హక్కులపై దాడి జరుగుతోందని అన్నారు.