75 వ రిపబ్లిక్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు గానీ, ప్రధానులు గానీ రావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి గణతంత్ర వేడులకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌కు సంబంధించిన ప్రత్యేకతలు
ఐదుగురు పాపులర్ ఫ్రెంచ్ నటులు
గెరార్డ్ డిపార్డీయు: గెరార్డ్ డిపార్డీయు 170 కి పైగా సినిమాల్లో నటించారు.
కేథరీన్ డెనియువ్: 1960 నుంచి వచ్చిన ఫ్రెంచ్ సినిమాల్లో కేథరీన్ డెనియువ్ కీలక పాత్రలు పోషించారు. ఆమె "బెల్లే దే జోర్" పాత్రతో ఫ్రెంచ్ సినిమాల్లో ఆమె చాలా ఫేమస్ అయ్యారు.
బ్రిగిట్టే బార్డోట్: బ్రిగిట్టే బార్డోట్ 1950, 1960 లలో ఫ్రెంచ్ సినిమాల్లో సెక్స్ సింబల్‌గా నిలిచింది. ఫ్రెంచ్ సినిమాల్లో లైంగిక విప్లవానికి నాంది పలికిన నటిగా ఆమె నిలిచారు.
మేరియన్ కోటిల్లార్డ్: ఇన్‌సెప్షన్, లా వీ ఎన్ రోజ్ వంటి పాత్రలతో మేరియన్ కోటిల్లార్డ్ ప్రసిద్ధి చెందారు.
ఆర్థరీ టాటౌ: ఫ్రెంచ్ సినిమాల్లో అతి ఎక్కువ మంది గుర్తించే నటిగా ఆర్థరీ టాటౌ గుర్తింపు పొందారు.
ఐదుగురు టాప్ ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్లు
జినెడిన్ జిదానే: 1998 వరల్డ్ కప్ ఫ్రాన్స్ విజయంలో జినెడిన్ జిదానే కీలక పాత్ర పోషించాడు. రియల్ మాడ్రిడ్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ సాధించాడు.
థియరీ హెన్రీ: ఫుట్‌బాల్‌లో ఎప్పటికీ గ్రేటెస్ట్ స్ట్రైకర్‌గా థియరీ హెన్రీ నిలిచాడు.
మైఖేల్ ప్లాటిని: 1984 యూరోపియన్ ఛాంపియన్ షిప్ మైఖెల్ ప్లాటిని నేతృత్వంలోనే ఫ్రాన్స్ గెలిచింది. 1983 నుంచి 1985 వరకు వరుసగా 3 సార్లు బాలన్ డీ ఓర్ అవార్డులు గెలుచుకున్నాడు.
కైలియన్ ఎంబాపే: ఫ్రాన్స్ 2018 ఫుట్‌బాల్ వరల్డ్ కప్ గెలవడంలో కైలియన్ ఎంబాపే కీలక ప్లేయర్‌గా నిలిచాడు. పారిస్ సెయింట్ జర్మన్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున భారీ విజయాలను నమోదు చేశాడు.
ఫ్రాంక్ రైబరీ: ఫ్రెంచ్ ఫుట్‌బాల్ టీమ్‌కు చాలా ఏళ్లు కీలకమైన ప్లేయర్‌గా ఫ్రాంక్ రైబరీ నిలిచాడు.
ఐదుగురు ఫ్రెంచ్ థింకర్స్
రెనె డెస్కార్టెస్: ఆధునిక ఫిలాసఫీ వ్యవస్థాపకుడు. ఆయన ఎప్పటికీ "ఐ థింక్ ధేర్ ఫోర్ ఐయామ్" (నేను అనుకుంటున్నా అందువలన అని) అని చెప్పేవారు.
జీన్ పాల్ సార్ట్రే: మార్క్సిజం కోసం చేసిన రచనలతో జీన్ పాల్ సార్ట్రే చాలా ఫేమస్ అయ్యారు. కొత్త ఆలోచనల కోసం మీ మెదడులోని ఎముకలను విరిచేయండి అని పేర్కొనేవారు.
సిమోన్ డి బ్యూవోయిర్: సిమోన్ డి బ్యూవోయిర్ స్త్రీవాదం కోసం పోరాటం చేస్తూ రచనలు చేసేవారు.
ఆల్బర్ట్ క్యామస్: 1957 లో లిటరేచర్‌లో నోబెల్ బహుమతి సాధించాడు.
మైఖెల్ ఫౌకాల్ట్: ఆధునిక సమాజం పౌరులను నియంత్రించే మార్గాలను మైఖెల్ ఫౌకాల్ట్ అన్వేషించారు. ఎక్కడ శక్తి ఉంటుందో అక్కడ ప్రతిఘటన ఉంటుందని పేర్కొనే వారు.
5 ఫేమస్ ఫ్రెంచ్ లిటరసీ క్లాసిక్స్
లెస్ మిజరేబుల్స్
ద త్రీ ముస్కెటీర్స్
మేడమ్ బోవరీ
ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ టైమ్
క్యాండిడ్
5 ఐకానిక్ ఫ్రెంచ్ పెయింటింగ్స్
వాటర్ లిల్లీస్
ది రాఫ్ట్ ఆఫ్ ది మెడూసా
ద కార్డ్ ప్లేయర్స్
బాల్ డు మౌలిన్ డె లా గాలెట్టే
ఉమెన్ విత్ ఎ హ్యాట్
5 ఫ్రెంచ్ వంటకాలు
కోక్ ఔ విన్
బుఇల్లబైస్సే
రాటాటౌల్లే
క్రీమ్ బ్రూలీ
క్వించె లోర్రైన్
ఫ్రెంచ్ పేరు కలిగి ఫ్రెంచ్‌తో సంబంధం లేని 5 వస్తువులు
ఫ్రెంచ్ ఫ్రైస్
ఫ్రెంచ్ కిస్
ఫ్రెంచ్ టోస్ట్
ఫ్రెంచ్ ప్రెస్
ఫ్రెంచ్ మానిక్యూర్