మేషం: ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నూతన గృహాపకరణాలు కొనుగోలుచేస్తారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాల అందుతాయి.
వృషభం: సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.
మిధునం: నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం: కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అతి కష్టంమీద పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.
సింహం: ఉద్యోగాలలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వామితో సఖ్యత కలుగుతుంది. బంధు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కన్య: అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. భూ సంభందిత క్రయ విక్రయాల అంతంత మాత్రంగా సాగుతాయి.
తుల: వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు అదిగమించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చికం: ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమునకు ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనస్సు: సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
మకరం: వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.
కుంభం: జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు.
మీనం: జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.