మెక్సికో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన టేకాఫ్ ఆలస్యం కావడంతో విసుగు చెందిన ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచి, రెక్కపై నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. ఏరోమెక్సికో కు చెందిన ఏఎమ్672 విమానం గ్వాటెమాలాకు ఉదయం 8.45 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. టేకాఫ్‌కు నాలుగు గంటలు ఆలస్యమైంది. ఈ క్రమంలోనే ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచి, విమానం రెక్కపై నడుచుకుంటూ బయటకు వెళ్లాడు.