తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులు కంపార్ట్మెంట్లు దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 76,104 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,412 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.92 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు సంబంధించి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలుపనుంది. 5 వేల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గత ఏడాదితో పోలిస్తే హుండీ ఆదాయం రూ.100 కోట్లు తగ్గినట్లు టీటీడీ అధికారులు పెర్కొన్నారు.