ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచంలోనే అతిపెద్ద నౌక.. 'ఐకాన్ ఆఫ్ ది సీన్' తొలి ప్రయాణం షురూ

international |  Suryaa Desk  | Published : Sun, Jan 28, 2024, 09:10 PM

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించిన ఐకాన్ ఆఫ్ ది సీన్ తన తొలి ప్రయాణాన్ని మొదలు పెట్టింది. రాయల్ కరీబియన్ సంస్థ రూపొందించిన ఈ నౌక అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ నౌకాశ్రయం నుంచి శనివారం సాయంత్రం బయలుదేరింది. వారు రోజుల పాటు సముద్రంపై విహరించనుంది. ఈ క్రమంలో వివిధ దీవులను ఇది చుట్టు వస్తుంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక ఐకాన్ ఆఫ్ ది సీన్ లోని విశేషాలు తెలుసుకుందాం.


రాయల్ కరీబియన్ సంస్థ రుపొందించిన ఐకాన్ ఆఫ్ ది సీన్ మొత్తం 365 మీటర్ల (1200 అడగులు) పొడువు ఉంటుంది. దీని బరువు సుమారు 2,50,800 టన్నులుగా ఉంటుందని అంచనా. ఇందులో 20 డెక్కులున్నాయి. ఈ నౌకలో ఆరు వాటర్ స్లైడ్లు, ఏడు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అలాగే ఐస్ స్కేటింగ్ రింగ్ సైతం ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఒక సినిమా థియేటర్, 40కిపైగా రెస్టారెంట్లు బార్లు ఏర్పాటు చేశారు. గతేడాది రాయల్ కరీబియన్ సంస్థ రూపొందించిన వండర్ ఆఫ్ ది సీస్ అనే నౌక ఇప్పటి వరకు అతిపెద్ద క్యూజ్ నౌకగా ఉంది. దాని పొడవు 1188 అడుగులు ఉండగా.. అందులో 18 డెక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఐకాన్ ఆఫ్ ది సీన్ దాని రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం సముద్రంపై తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించింది.


కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారికి అత్యుత్తమ అనుభూతిని అందించేలా ఈ నౌకలో సౌకర్యాలు ఉన్నట్లు కరీబియన్ కంపెనీ సీఈఓ జాసన్ లిబర్టీ పేర్కొన్నారు. ఈ నౌకలో మొత్తం 2,350 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ఈ నౌకకు మొత్తంగా 7,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com