ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇవాళ ప్రధాని మోదీ ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 3వేల మంది స్టూడెంట్స్ పాల్గొననున్నారు. పరీక్షల సమయం సమీపిస్తున్నందున విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడేందుకు వారితో ప్రధాని మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.