ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి చాలా మంది కలెక్టర్లు కూడా ఉన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ బాలాజీరావు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అలాగే నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీని శ్రీకాకుళం కలెక్టర్‌గా బదిలీ చేశారు. అలాగే లక్ష్మీ షా తిరుపతి కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐఏఎస్‌లను భారీగా బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.