ఫ్రాన్స్‌లో రైతుల సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు ఆదివారం పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోకి చొచ్చుకెళ్లారు. అనంతరం మోనాలిసా చిత్రానికి రక్షణగా ఏర్పాటుచేసిన గాజు పలకపై సూప్ చల్లారు. ‘మన వ్యవసాయ రంగం దుర్భరంగా ఉంది. మన రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.