పశ్చిమాసియాలోని జోర్డన్లో జరిగిన డ్రోన్ దాడిలో అమెరికా బలగాలకు చెందిన ముగ్గురు సైనికులు మృతి చెందారు. సుమారు 25 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధ్రువీకరించారు. ‘డ్రోన్ దాడి ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం సేకరిస్తున్నాం. ఇరాన్ ప్రోత్సాహంతో ఇరాక్, సిరియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్ గ్రూప్లు ఈ దాడికి పాల్పడ్డాయి’ అని పేర్కొన్నారు.