ఢిల్లీ అంతర్జాతీయ పోస్ట్ ఆఫీస్‌లో డీఆర్ఐ అధికారులు భారీగా బంగారంతో పాటు వెండిని పట్టుకున్నారు. రూ.11 కోట్ల విలువ చేసే 16.67 కేజీల బంగారంతో పాటు 39.73 కేజీల వెండిని అధికారులు సీజ్ చేశారు. హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ పార్సిల్లో బంగారం, వెండిని గుర్తించారు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎలక్ట్రిక్ మీటర్ల పై భాగంలో బంగారంతో పాటు వెండి కోటింగ్ చేసి పైన నల్లటి పెయింట్‌ను స్మగ్లర్స్ రుద్దారు.