పేదల పెన్నిధి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు ఎవ్వరికీ ఆకలి చావు లేకుండా, ప్రతి ఒక్కరూ గౌరవంగా తలెత్తుకుని బతికేలా సుపరిపాలన అందించారు అని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వారిని అక్కున చేర్చుకొన్న మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్ జగన్. సామాజికంగా వెనకబడిన వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన నాయకుడు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు అనేక పదవులిచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా నా వంటి దళితుడిని రాజ్యసభకు పంపుతున్న మహానుభావుడు. ఇది నాకిచ్చిన కానుక కాదు. పేద దళిత, అణగారిన వర్గాలకు, ఉత్తరాంధ్రకు ఇచ్చిన కానుక. రాజ్యసభలో మన ప్రభుత్వ సంస్కరణలను వినిపిస్తాను. సీఎం జగన్ మరోసారి గెలిస్తేనే సంక్షేమ ఫలాలు కొనసాగుతాయి. లేదంటే ప్రజలకు అందవు. అందుకే జగన్‌నీ ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకోవాలి అని పిలుపునిచ్చారు.