జగనన్న సైనికులుగా, వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రతి ఒక్క కార్యకర్తా సైన్యమై కదలాలి. రాష్ట్రంలో ప్రతి పేద విద్యారి్థకి నాణ్యమైన విద్య, ఆంగ్ల విద్య అందాలన్నా, రాష్ట్రంలో రైతుకు మంచి జరగాలన్నా, గౌరవంగా వ్యవసాయం చేయాలన్నా, ఇంటి వద్దకే ఎరువులు రావాలన్నా, పంటను అక్కడికక్కడే అమ్ముకోవాలన్నా జగనన్నే మళ్లీ సీఎం కావాలి అని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. పేదవాడు జన్మభూమి కమిటీల వద్ద తలదించుకోకుండా, ఎవరి వద్దా చేతులు కట్టుకోకుండా నేరుగా ఇంటింటికి సంక్షేమ ఫలాలు చేరాలన్నా, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా జగనే ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రతి వైఎస్సార్‌సీపీ సభ్యుడు, జగనన్న శ్రేయోభిలాషులు అందరూ సైన్యమై కదలాలి అని అన్నారు.