విశాఖ జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న జగనన్నకు చెబుదాంలో వచ్చిన అర్జీలపై అధికారులునిర్దేశిత సమయంలో పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలో రెవిన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్ తో కలిసి జెకెసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 266 మంది అర్జీదారులు నుండి వినతులను స్వీకరించారు.