మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు విక్రయించకూడదని జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ సోమవారం తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మాంసం, చేపలు విక్రయించిన దుకాణాలపై జీవీఎంసీ పశువైద్య విభాగపు సిబ్బంది అపరాధ రుసుము విధిస్తారని తెలిపారు. రూ. 500 నుండి రూ. 5000 వరకు అపరాధ రుసుముతో పాటు వ్యాపార లైసెన్సులు, మాంసంను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa