ఏపీలో 25 శాతం మరణాలు నాసిరకం మద్యం వల్లే జరుగుతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులు లేకపోవడం వల్ల ఇష్టం వచ్చిన ధరలకు మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. ఏపీ మద్యం అమ్మకాల్లో ఇంత అవినీతి జరుగుతున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ దర్యాప్తు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.