రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సభ ప్రారంభం కానుంది. కొత్త పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ద్రౌపది తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుత లోక్‌సభ చివరి సమావేశాలు కావడంతో సమావేశాలను సుహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది.
ముఖ్యమైన బిల్లులన్నీ గత సమావేశాల్లోనే ఆమోదం పొందడంతో ఓటు ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లుల ఆమోదానికి కేంద్రం తీసుకువస్తోంది.... ఈ బిల్లులన్నీ ఇప్పటికే ఉభయ సభల్లో ప్రవేశపెట్టినందున... ఆమోదం కోసం చర్చకు తీసుకురానున్నట్టు సమాచారం. కొత్తగా తీసుకొచ్చిన భద్రతా ఏర్పాట్లపై అన్ని పార్టీలకు వివరించనున్నట్లు సమాచారం. సభా కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలన్నారు.