ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం జగన్ అభ్యర్థులను మారుస్తున్నారు. సీటు రాని ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. అయితే వైసీపీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని సమాచారం. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇటీవల మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు కోనేటి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని మరో రెండు, మూడు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరుతారని సమాచారం.