కాశీలోని జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన సర్వేలో చాలా ఇంట్రస్టింగ్ విషయాలు బయటపెట్టింది. మసీదు ప్రాంగణంలో 12, 17 శతాబ్ధాలకు చెందిన 34 సంస్కృత,
ద్రవిడ భాషల శాసనాలు ఉన్నట్లు ఏఎస్ఐ నివేదికలో వెల్లడించింది. ఒక దానిలో మల్లన్నభట్లు, నారాయణ భట్లు అనే పేర్లు తెలుగులో రాసి ఉన్నాయని తెలిపింది. తమకు లభించిన ఆధారాలను బట్టి అక్కడ కచ్చితంగా హిందూ దేవాలయం ఉండేదని ఏఎస్ఐ తేల్చి చెప్పింది.