మాజీ మంత్రి పొంగూరు నారాయణ హయాంలోనే నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధి జరిగిందని, గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పూర్తిగా శూన్యమని నారాయణ కుమార్తె షరణి తెలిపారు. బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నెల్లూరు నగరం 8వ డివిజన్ లోని ముకుంద పురం, పోలీస్ క్వార్టర్స్, నవాబుపేట తదితర ప్రాంతాల్లో షరణి పర్యటించారు.