సివిల్ రైట్స్ డే ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కురబలకోట తహసీల్దార్ భీమేశ్వరరావు కోరారు. మట్లివారిపల్లి, యరమద్దివారిపల్లి, కొండకింద దళితవాడలో మంగళవారం సివిల్ రైట్స్ డే జరిగింది. తహసీల్దార్ మాట్లాడుతూ. ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారానికి రెవిన్యూ అధికారులతో సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.