తాను వైసీపీ పార్టీ మారటం లేదని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఒంగోలులో పర్యటించిన సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట ఉంటే బాగుంటుందని నా ఉద్దేశ్యమని, వైసీపీ అధిష్టానం ఏది చెబితే అదే చేస్తానని, నా ఒంగోలను నేను చూసుకుంటానని తెలిపారు. ఒంగోలులో త్వరలో 25 వేల ఇంటి పట్టాలను అందజేస్తున్నట్లుగా తెలిపారు.