భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈడీ అధికారులు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్కు పది సార్లు నోటీసులు జారీ చేశారు.అయినా, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోడంతో ఇవాళ హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. ఈ మేరకు కేసు సంబంధించి ఆయనను విచారిస్తున్నారు. ఏ క్షణంలో అయినా సొరెన్ను అరెస్ట్ చేసే పరిణామాలు కనిపిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa