మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత సీఎం నివాసం, రాజ్ భవన్, రాంచీలోని బీజేపీ కార్యాలయం సహా పలు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. మరోవైపు జార్ఖండ్‌లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారీగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. సిఎం హౌస్‌లో హేమంత్ సోరెన్‌ను ఇడి బృందం సుమారు ఏడు గంటల పాటు విచారించింది.