చంద్రగిరి నియోజకవర్గంలో అత్యంత అధునాతన సదుపాయాలతో కూడిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని చిన్నగొట్టిగల్లు మండల ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్పారు. బుధవారం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతుల మీదుగా అత్యంత వేడుకగా సామాజిక ఆరోగ్య కేంద్రం(ఆసుపత్రి) ప్రారంభోత్సవం జరిగింది. అత్యవసర విభాగం, ఓపీ, ఈసీజీ, ఆరోగ్యశ్రీ తదితర విభాగాలను ప్రారంభించారు.