ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదించారు. అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు వైయస్ జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.