విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మరోసారి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని అనే కుక్కకు బుద్ధి చెప్పాలని ర్యాలీగా వచ్చినట్లు తెలిపారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. తాను అప్లికేషన్ పెట్టడానికి వస్తేనే భారీగా కేడర్ వచ్చారన్నారు. చంద్రబాబు - పవన్ గురించి చెడుగా మాట్లాడే కుక్కల తాట తీస్తానని హెచ్చరించారు. ‘‘దమ్ముంటే రండి...మీరో మేమో చూసుకుందాం. చంద్రబాబు నాకు దైవ సమానులు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాను. సీటు రాలేదని మా పార్టీ వాళ్ళెవరైనా సరే చంద్రబాబును విమర్శిస్తే తాట తీస్తాను’’ అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.