పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం వేదికగా బీజేపీ సార్వత్రిక ఎన్నికల శంఖం పూరించింది. గురువారం భీమవరం సభలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ..
బీజేపీలో వారసత్వ రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. ఒక సాధారణ కార్యకర్త ప్రధాని కావడం.. బీజేపీలోనే సాధ్యమని చెప్పారు.