అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో దారుణం చోటు చేసుకుంది. పెన్షన్ పంపిణీకి వెళున్న వాలంటీర్ హత్యకు గురయ్యాడు. లచ్చన్నపాలెం గ్రామ సమీపంలో
కాలువ వద్ద వాలంటీర్ నడింపల్లి హరిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.