జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్యజరిగిన పరస్పర దాడులను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. గురువారం సీఐ నరేష్‌ను వీఆర్ కు అటాచ్ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీడీపీ ఇన్ ఛార్జ్ భూపేష్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరగడంతో ఒక్కసారిగా ముద్దనూరులో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంలో చర్యలు తీసుకున్నారు.