ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలని, పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.