అనంతపురం ఉమ్మడి జిల్లాలో ప్రతి రెండు మండలాలకు ఒక డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని డిసిఓ ఆఫీస్ లో గురువారం వినతి పత్రాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా జి. వీరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం అంబేద్కర్ గురుకుల పాఠశాలల ప్రవేశాలకు ప్రతి ఏడాది దాదాపుగా 12, 000 మంది పైగా అప్లై చేస్తున్నారు అని అన్నారు.