మతతత్వ శక్తులతో రాజీపడక పోవడమే జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ చేసిన తప్పు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. మహారాష్ట్రలో రూ.73 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అజిత్ పవార్‌పై ప్రధాని మోదీ ఆరోపించారని,
కానీ అలా చెప్పిన మూడు రోజులకే అజిత్‌ను డిప్యూటీ సీఎం చేశారని విమర్శించారు. వారికి అనుకూలంగా లేకపోతే కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తారని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.