ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "వైఎస్ఆర్ కుటుంబం మాట ఇస్తే నిలబడతారు అనే నమ్మకం ప్రజల్లో ఉంది.
వైఎస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారు. షర్మిల మెడలో కండువా కాంగ్రెస్ పార్టీది.. ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుది." అంటూ మండిపడ్డారు.