ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం అస్సాం చేరుకోనున్నారు, ఈ సందర్భంగా దాదాపు రూ.11,600 కోట్ల విలువైన ప్రాజెక్టుల శ్రేణికి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం తెలిపారు. సమావేశంలో ప్రసంగించిన శర్మ, శనివారం రాత్రి 7:30 గంటలకు గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీ విమానం దిగుతుందని, ఆ తర్వాత ఆయన కోయినాధోర స్టేట్ గెస్ట్ హౌస్ వైపు వెళ్తారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులతో ఆయన భేటీ అవుతారని సీఎం తెలిపారు.అంతేకాకుండా రూ. 3,250 కోట్లతో నిర్మించనున్న గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు సమీకృత నూతన భవనానికి మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.