నిరుద్యోగ సమస్యపై మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇది దేశంలోనే అతిపెద్ద సమస్య అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, దేశంలో 30 లక్షలకు పైగా ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయని బీజేపీకి ఏమీ అర్థం కావడం లేదన్నారు.నిరుద్యోగ సమస్యను "అతిపెద్ద సమస్య"గా పేర్కొంటూ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.‘అగ్నీపథ్ యోజన’ గురించి ప్రస్తావిస్తూ, ఎవరినీ సంప్రదించకుండానే ప్రధాని మోదీ ఈ పథకాన్ని వైమానిక దళం మరియు నౌకాదళంలో అమలు చేశారని అన్నారు.టమాటా, ఉల్లిపాయలు, పాలు, మైదా, బియ్యం,శనగలు... అన్నింటి ధరలు రెట్టింపు అయ్యాయని ఆయన అన్నారు.‘‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ఎంఎస్‌పీని పెంచుతామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ నేడు రైతుల వార్షికాదాయం 1.5 శాతం తగ్గింది అని తెలిపారు. .