పట్టణ స్థానిక సంస్థల్లోని టిడ్కో ఇళ్లవద్ద మహిళా మార్టులు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పులివెందులలో ప్రారంభించిన మహిళామార్టు విజయవంతం కావడంతో త్వరలోనే 21 చోట్ల ప్రారంభించనున్నారు.
పట్టణ మహిళా సంఘాల సభ్యులే వాటాదారులుగా నిలిచి రూ. 150 చొప్పున పెట్టుబడి పెడతారు. సరుకుల కొనుగోలు నిర్వహణ వారే చూసుకుంటారు. వచ్చే లాభాలను వారే పంచుకుంటారు.