కర్ణాటక రాష్ట్రంలోని ముల్‌బాగల్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లిని టిఫెన్ పెట్టమని కొడుకు అడిగాడు. ఆమె నిరాకరించడంతో కొడుకు కనికరం లేకుండా తల్లిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేశాడు.
ఆ తర్వాత బాలుడు నేరుగా అక్కడి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చనిపోయిందని నిర్దారించారు. బాలుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.