గ్రామంలోని ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని హెల్త్ సూపర్వైజర్ నాగరత్న అన్నారు. పెద్ద కౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య విద్యా బోధకులు వెంకటరమణ ఆదేశాల మేరకు శుక్రవారం షేక్షానిపల్లిలో డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామంలోని పలు కాలనీలను సందర్శించి పరిసరాల పరిశుభ్రతకు చర్యలు చేపట్టారు.