బ్రహ్మసముద్రం మండలం వేపులపర్తి సబ్ స్టేషన్ ఎదుట గ్రామాల రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ 10 రోజులుగా విద్యుత్ అంతరాయంతో వేసిన పంటలు కాస్త ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. కరెంట్ సమయా నికి రాక పంటలకు నీరు పెట్టకపోవడంతో పంటలు ఎండిపోయి మేము పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాక నానా ఇబ్బందులు గురవుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో రైతులు పాల్గొన్నారు.