కుష్టు వ్యాధి నివారణకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ పావని తెలిపారు. శుక్రవారం రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆమిద్యాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి అవగాహన ర్యాలీ నిర్వహించారు. 2024 జనవరి 30 నుంచి 2024 ఫిబ్రవరి 13 వరకు కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.