జన బలమే గీటురాయిగా, సామాజిక న్యాయమే అభిమతంగా శాసనసభ, లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకంపై కసరత్తు చేస్తూనే.. మరోవైపు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను వైయస్ఆర్సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించడంతో పాటు ‘సిద్ధం’ పేరుతో శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత శనివారం విశాఖపట్నం జిల్లా భీమిలి వేదికగా ఎన్నికల సమరానికి శంఖం పూరించారు. ఆ సభ సూపర్‌హిట్ అయిన నేపథ్యంలో శనివారం ఏలూరులో ‘సిద్ధం’ రెండో సభ నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో జరగనున్న "సిద్ధం" భారీ బహిరంగ సభకు జగ్గయ్యపేట నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ శ్రేణులు పెద్దయెత్తున తరలివెళ్ళారు. పట్టణంలోని ఎస్జీఎస్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను "సిద్ధం" సభ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.