యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను లక్ష్యంగా చేసుకుని యూకే, అమెరికా సైన్యాలు దాడుల చేశాయి. ఫైటర్ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి.
హౌతీలకు చెందిన కమాండ్ కంట్రోల్‌తోపాటు 36 స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం తెలిపింది. యెమెన్‌ను స్థావరంగా చేసుకున్న హౌతీ రెబల్స్.. ఇజ్రాయెల్ సైన్యాలు గాజాలోని పాలస్తీనియన్లను చంపడానికి నిరసనగా అమెరికా, దాని భాగస్వామ్య దేశాలపై దాడులకు పాల్పడుతుంది.