డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్ తొలి గెలుపు నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో ఘన విజయం సాధించారు. మిన్నెసొటా ప్రతినిధి డీన్ ఫిలిప్స్, రచయిత మెరియన్ విలియమ్సన్పై ఆయన గెలుపొందారు.
2020లో అంచనాలను తలకిందులు చూస్తూ దక్షిణ కరోలినా ఓటర్లు తన విజయానికి బాటలు వేశారని బైడెన్ తెలిపారు. 2024లోనూ అదే పునరావృతం అవుతుందన్నారు.