పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో దారుణం జరిగింది. ఎర్రగుంట తండాకు చెందిన బాలస్వామి నాయక్ వినుకొండలో డిగ్రీ చదువుతున్నాడు. అవసరాల నిమిత్తం రుణ యాప్ ద్వారా కొంత డబ్బు తీసుకుని ప్రతి నెల ఈఎమ్ఐలు కడుతూ వచ్చాడు.
ఈ నెల కట్టలేకపోవడంతో రుణయాప్ నిర్వాహకులు వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థి బాలస్వామి తీవ్ర మనోవేదనకు గురై అడవిలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa