‘అర్జునుడు’ తన ఆడపడుచుల్ని రక్షించాడే కానీ.. ఎప్పుడూ తూలనాడలేదు. జగన్ తనను తాను అర్జునుడిగా పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది. సొంత చెల్లి షర్మిలను అత్యంత నీచంగా మాట్లాడుతుంటే ప్రోత్సహించే వ్యక్తి.. తోబుట్టువుకి గౌరవం ఇవ్వని వ్యక్తి.. సొంత చిన్నాన్నను నిర్దాక్షిణ్యంగా చంపేసిన వాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తి.. అర్జునుడితో పొల్చుకుంటున్నాడు. ఎవరు కౌరవులు, ఎవరు అర్జునుడని.. నేను మాట్లాడను. ఇది కలియుగం. మనమెవరం అర్జునుడు, కృష్ణుడు, కౌరవులతో పొల్చుకోవద్దు. మీరు జగన్. మీది వైసీపీ. నేను పవన్. నాది జనసేన. ఎవరు మంచివాళ్లు, ఎవరు ప్రజలకు అండగా ఉండేవాళ్లు. ఎవరు దోపిడీదారులనేది ప్రజలకు బాగా తెలుసు. వారే నిర్ణయిస్తారు అని పవన్ కల్యాణ్ తెలిపారు.