జగన్ మాట్లాడితే ‘సిద్ధం’ అంటున్నారు. రాష్ట్రమంతా పోస్టర్లు వెస్తున్నారు. దేనికి సిద్ధం? నేను అబద్ధమే చెప్పనన్న జగన్ చెప్పేదే అబద్ధాలని బాలశౌరి అన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మద్య నిషేధం చేస్తామన్నారు. అవ్వన్నీ మరిచిపోయారు. చెప్పుకొంటూ పోతే అబద్ధాల లిస్ట్‌కి అంతులేదు. జగన్ గారూ.. మీరు బాధపడకండి మేం వస్తున్నాం. ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేం మౌనంగా ఉన్నామనుకుని, ఏమీ ఆలోచించడం లేదని అనుకోవద్దు. ప్రతి రోజూ ఒక సభ పెడతాం. మిమ్మల్ని ఎండగడతాం. మాటకు మాట కాదు.. మాటలతో ఏకేస్తాం. మాటలు కత్తుల్లా వస్తాయి. కాచుకోండి. లక్షల మందితో సభలు పెట్టుకోండి. పిల్లలకు ఇంటర్ మీడియట్ పరీక్షలు రద్దుచేసి మరీ మీరు సభలు నడుపుకోండి. అన్నింటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. జనసేన ఏడు సూత్రాల భావంతో కట్టుబడి ఉంది. ఏడు సూత్రాల దండకి మణిహారమైన బాలశౌరి వచ్చి చేరా రు. మనందరం కలిసి రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్తు కోసం పనిచేద్దాం. నేను ఎప్పుడూ ఎన్నికల గురించి మాట్లాడను. భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తాను అని అన్నారు.