ఇరాక్, సిరియాలో తాము ఇటీవల జరిపిన ప్రతీకార దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని.. అంతం కాదని అమెరికా ఆదివారం తెలిపింది. ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు మరిన్ని చర్యలు ఉంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఘర్షణను కోరుకోవడం లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలీవన్ పునరుద్ఘాటించారు. అయితే, అమెరికన్ల జోలికి వస్తే సహించేది లేదని, మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు.